Book Description
దాదాపు మూడు దశాబ్దాల అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థినుల జీవితాలకు, అక్షరాలకు వెలుగును ప్రసాదించిన భారతిగారు కేవలం అధ్యాపకురాలు మాత్రమే కాదు గొప్ప విదుషీమణి, రచయిత్రి కూడా. తెలుగు సాహిత్యాన్ని తన ప్రసిద్ధ రచనలతో సుసంపన్నం చేస్తూ సమకాలీన అంశాలే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులకు సరళ రచనలుగా అందించిన విద్వన్మణి. మేడమ్ కథలన్నింటిలో కన్పించేది ఒక అధ్యాపకురాలు ‘సీత’ మాత్రమే కాదు ఎందరో గురువులు, మరెందరో శిష్యులు. వారి వారి సమస్యల కడలిలో చుక్కానిపట్టి తీరం చేర్చిన తెరచాపలా ‘సీత’ ఆదర్శవంతమైన ‘మేడమ్’గా కన్పిస్తూ పాఠకులందరికీ వారివారి జీవితాల్లో దారిచూపిన మరెందరో ‘మేడమ్’లను గుర్తుచేస్తుంది.