Book Description
ఇంకొక చిత్రము. ఈ నవలలో ప్రధాన పాత్ర అయిన పంకజం పుట్టుకచేత వేశ్య. ఈమె నారాయణవంటి సద్గృహస్థుని ప్రేమించడం అవాంఛనీయమేగాక జుగుప్సాకరము కూడాను. కాని మనసిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఉన్నతాదర్శాలు, ఉత్తమ భావాలు, మనలను చకితులను చేస్తవి. ఏహ్యభావం ఎక్కడా పొడసూపదు. ఇటువంటి విచిత్ర వ్యక్తులు ఎక్కడో నూటికికోటికి ఒకరు ఉంటే మనలను ఈ నవల అంతగా ఆకర్షించేది కాదు. ఇటువంటి ప్రవృత్తిగలవారు సర్వకాలంలోనూ ఉంటారు, సర్వసాధారణంగానూ ఉంటారు. అందుచేతనే ఈ చిత్రణకు విశ్వజనీనత్వము సిద్ధించింది. జుగుప్సను కలిగించే వేశ్య జీవితాన్ని తీసుకుని దానిని రమణీయము, సుందరము, ఆనందజనకము అయిన వృత్తాంతముగా చేయడంలో ఈ రచయిత్రి ప్రతిభ ప్రదర్శితమౌతూ ఉన్నది.