Book Description
ఈ రచయిత్రి కబీరు, చైతన్యులవంటి భగవద్భక్తులవలె తన ఆవేశానికి తానే తట్టుకోలేని భావావేశం కలది. ఈ రచనలు చదువుతున్నంతసేపూ, నా మట్టుకు నాకు, ఒక వుప్పెన గాలిలో చిక్కుకున్నట్లే అయింది. ఏ క్షణం ఈ ఉద్వేగప్రవాహం తన అవధులను తానే ఛేదించుకొని ఏ పొట్టలు పోసుకున్న పైరుల మీదకు పరవళ్ళు త్రొక్కుతుందో, అని భయమే వేసింది. ఈమె భావావేశంలో అంత తీవ్రతవుంది. పైగా తన భావావేశానికి ఈమె ముసుగులు వెయ్యదు. అందాలు తొడగదు. ఉబికిన ఉద్వేగాన్ని ఉబికినట్లే పొందుపరుస్తుంది. ఉండిపోనిస్తుంది.