Book Description
గౌతమ్ రచయిత. అతని రచనలను అభిమానించే విరాజి పరిచయమై ఎంతో సన్నిహితమవుతుంది. అతని రచనలకు ఆమె ఊపిరి.అతను మంచి రచయిత కాగలడని ఆమె విశ్వాసం. ఆమె వ్యక్తిత్వం,సంస్కారం అతన్నిఎంతగానోఆకర్షిస్తాయి. విరాజి ప్రోత్సాహంతో పదిరోజుల్లో నవలరాసి పోటికి పంపిస్తాడు గౌతమ్. ఆ నవలకు మొదటి బహుమతి వస్తుంది. బహుమతిగా వచ్చిన డబ్బుతో డ్యాన్స్ బ్యాలే తయారు చేస్తున్నారు గౌతమ్,విరాజి.బ్యాలే కొద్దిరోజులుందనగా విరాజికి అపెండిసైటీస్ వస్తుంది. ఆపరేషన్ కు డబ్బులేదు. ఇక తప్పని సరై,డబ్బుకోసం ‘నాదముని’ మధ్యలో వదిలేసిన సీరియల్స్ పూర్తిచేస్తున్నాడు గౌతమ్.ఈ విషయం తెలిసిన విరాజి షాక్ తింటుంది. గౌతమ్ ఉన్నతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అతను చెప్పిన కారణాన్ని కూడా వప్పుకోదు. గౌతమ్ అంటే విరాజికి ఏహ్యభావం కలుగుతుంది.విరాజి లేకుండా తను తనుగా ఉండలేకపోతున్నాననే సంఘర్షణ ప్రారంభమౌతుంది గౌతమ్ లో.ఈ సంఘర్షణ పర్యవసానం ఏమిటో…విరాజి చదివితే తెలుస్తుంది.