Book Description
కనులకింపైన ప్రకృతీ రమణీయతతో,నిండైన మనుష్యులతో అలరారే గ్రామసీమ ‘ఆనందపురం’ఆ ఊరి దేవాలయంలో భగవంతుని సేవిక- ‘వేదిత’.విధి వక్రించి జీవితం ఓ శాపంగా మారేసరికి ‘వేదిత’ అయింది ఆమె. ముగ్ధమోహన సుందరాంగి అయిన అమాయిక.కాని చక్రభ్రమణం నిరంతరం కదా! అందుకని అనుభవాల అంచులు చుట్టి, ఆనందపురానికి వచ్చి తపస్వినిగా మారి ‘నివేదిత’ అయింది.నవ్యతలేని ఇతివృత్తాలతో,విసిగి,విథిలేక వాటిలోనే ఆణిముత్యాల నేరుకుంటున్న పాఠకులకు నూతన పోకడలతో, విశిష్ట విభిన్న పాత్రలతో, సంపూర్ణ,సమగ్ర మనస్తత్వ నిశిత పరిశీలనతో, మధుర ఘట్టాలతో, గంభీర సన్నివేశాలతో ప్రతి ఒక్కరిని తనదైన బాణితో ఆకట్టుకున్న శ్రీకొమ్మూరి వేణుగోపాలరావు గారి కలం నుంచి వెలువడిన మరో చక్కటి నవల‘నివేదిత’.