Book Description
అప్పుడే..! ఆ క్షణంలో ఏదో జ్ఞాపకం నా తలమీద త్రిశూలంతో తట్టినట్లైంది. అంతరాంతరాల్లోంచి ఏదో జ్వాల ఉప్పొంగినట్లైంది. మధురంగా మనసును ఆవరించినట్లైంది. అదే ఓంకార నాదం. ఆ ఓంకారనాదం తొలిసారిగా నేను ఆదిపురిలోకి అడుగుపెట్టినప్పుడు ఓ గుడిలోంచి విన్పించింది. ఆ జ్ఞాపకమే నన్ను సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన నుండి బయటకి లాగింది. అసలు అమృతంతో పాటే హాలాహలం పుట్టినట్లు ప్రేమతోపాటే ఈర్ష్యా, ద్వేషాలు పుట్టుకొస్తాయట. దాని ఉత్పత్తి కారకమైన ‘లవ్ హార్మోన్’ను అదుపులో వుంచితే ఎవరి జీవితమైనా సాఫీగా సాగిపోతుందట. అది ధ్యానంతోనే సాధ్యమవుతుందని విన్నాను. వెంటనే పద్మాసనం వేసుకొని ఆ గది మధ్యలో కూర్చున్నాను. కూర్చున్నానే కాని నిలకడగా కూర్చోలేకపోయాను. చాలాసేపు ప్రయత్నించి చివరకు కళ్లు మూసుకున్నాను.